హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువ ఉన్నా సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఈ విషయంపై సీసీఐ సీఎండీ, సీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. శనివారం పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించా రు. మార్క్‌ఫెడ్ అధికారులతో వానకాలం కొనుగోళ్లపై ఆరా తీశారు. మా ర్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రావు పెసర, సోయాబిన్ కొనుగోళ్లు తుది దశకు చేరాయని మంత్రికి వివరించారు.