హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి తిరుపతికి లహరి ఏసీ, రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో 10-15% మేర చార్జీలను తగ్గిస్తున్నట్టు శనివారం టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది.