హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ) : కొత్త సంవత్సరంలో నిర్ణీత సమయంలోనే ఉద్యోగ నియామకాలు పూర్తిచేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టంచేశారు. గణతంత్ర ది నోత్సవాన్ని పురస్కరించుకొని సోమవా రం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయం లో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఒకే పరీక్షతో పూర్తయ్యే నియామకాలను మూడు నెలల్లోపు, మల్టిపుల్ పరీక్షలున్నవి ఆరునెలల్లో భర్తీచేస్తామని తెలిపారు. ఇక నుంచి నిర్ణీత గడువులోనే పూర్తిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, ప్రొఫెసర్ ఎన్ యాదయ్య, లక్ష్మీకాంత్ రాథోడ్, కార్యదర్శి హరిత పాల్గొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
ప్రాక్టికల్ సెంటర్ల కేటాయింపులో అన్యాయం ; ఎమ్మెల్సీ కొమురయ్య
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రాక్టికల్ సెంటర్లను ఏర్పాటు చేయకపోవడం అత్యంత దారుణమని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ యాజమాన్యంలోని కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని వాపోయారు. దీంతో విద్యార్థులు 15 కి.మీ వెళ్లి ప్రాక్టికల్స్‌కు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. సర్కార్ కాలేజీల్లో సీసీ కెమెరాలు బిగించి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించిన తర్వాత ఎందుకు సెంటర్లను ఉపసంహరించారని ప్రశ్నించారు. ప్రభుత్వమే, ప్రభుత్వ కాలేజీలపై వివక్ష చూపితే ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఇంటర్‌బోర్డు ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.