హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం పలువురు విరాళాలు అందించారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులు వీ సురేందర్, ఎస్‌ఎన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి రూ.1,01,75,000 చెక్కును అందజేశారు.
అలాగే రూ.51 లక్షల చెక్కును విన్స్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ ఎస్ఎన్ డాగ, సీఈవో సిద్ధార్థ డాగ, రూ.10 లక్షల చెక్కును ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండీ కేవీ సుబ్బయ్య, డైరెక్టర్ సోమలింగంగౌడ్, రూ.25 లక్షల చెక్కును బొండాడ గ్రూప్ సీఎండీ బొండాడ రాఘవేంద్రరావు, 25 లక్షల చెక్కును భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఎండీ కే రామ్మోహన్రావు సీఎంకు అందజేశారు.