శేరిలింగంపల్లి, ఆగస్టు 13 : గోపన్‌పల్లిలోని తమ భూములను తమకు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 29 రోజులుగా ఆందోళన చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు ఉద్యోగుల పక్షాన నిలబడాలి కానీ, అందుకు భిన్నంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం చేపట్టిన నిరసనలో ఉమ్మడి వరంగల్, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఉద్యోగులు పాల్గొని బీటీఎన్జీవోలకు సంఘీభావం తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీటీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు రామకృష్ణ , భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బురుగు రవికుమార్‌గౌడ్, బీటీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదాబేగం, సంధ్యారాణి, నర్సింహరాజు, ఏక్నాథ్గౌడ్, కేశియనాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.