హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతమ్ తెలిపారు. కలిసి పోటీచేసే స్థానాలపై పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో చర్చించిన తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. బీఎస్పీ పోటీచేసే స్థానాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో రాంజీగౌతమ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు, ప్రధాన కార్యదర్శులు విజయ్ ఆర్య, కే ఈశ్వర్ తదితరులు చర్చలు జరిపారు. బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య సీట్ల పంపకాలు, పోటీచేసే స్థానాలపై చర్చించారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి టీ హరీశ్ రావు, మాజీ ఎంపీ బాల్క సుమన్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.