జ్యోతినగర్, సెప్టెంబర్ 8: గుజరాత్‌లోని గాంధీనగర్ బీఎస్ఎఫ్ క్యాంపు క్వార్టర్లో శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సుభాష్‌నగర్‌కు చెందిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నది. కానిస్టేబుల్ బల్ల్ల గంగాభవానీ (26) శనివారం మధ్యా హ్నం వరకు హెడ్‌క్వార్టర్స్‌లో సెంట్రింగ్ డ్యూటీ చేసి, తన నివాసానికి వెళ్లింది. రాత్రి 9 గంటలైనా గంగాభవానీ డ్యూటీకి రాకపోవడంతో అధికారులు ఆమె క్వార్టర్ కు వెళ్లారు. తలుపు గడియపెట్టి ఉండటంతో దంతివాడ పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తొలగించారు. అప్పటికే గంగాభవానీ ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఆమె మృతదేహాన్ని ఎన్టీపీసీకి తరలించా రు. కాగా ఆమెకు 15 రోజుల క్రితమే వి వాహం కుదిరింది. డిసెంబర్ 5న పెండ్లికి ముహూర్తం ఖరారైంది. పక్షం రోజుల క్రితం ఎన్టీపీసీకి వచ్చిన ఆమె ఈ నెల ఒకటిన గుజరాత్‌కు వెళ్లి విధుల్లో చేరింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.