హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి సోయిలేని మాటలు, సోయిలేని విమర్శలు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. సీఎం పూర్తిగా మాటలకే పరిమితమై, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కొడంగల్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గురువారం ఆయన తీవ్రంగా ఖండించారు.
రాష్ర్టానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రే, ఇలా అనుచిత వ్యాఖ్యలతో వివాదాలు సృష్టిస్తూ, వార్తల్లో నిలువడం దురదృష్టకరమని మండిపడ్డారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని? నెరవేర్చినవి ఎన్ని ? లెక్క చెప్పాలని బాలు సూటిగా డిమాండ్ చేశారు. అసలు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని ఆయన ప్రశ్నించారు. హామీల గురించి ప్రశ్నించిన కేసీఆర్, కేటీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడం రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సహనం శాశ్వతం కాదని, సరైన సమయంలో రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని తుంగ బాలు హెచ్చరించారు.