హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : వీసీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ పోస్టుల నియామకాల్లో ఎకడా కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించలేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీసీల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు చదువుకునే విశ్వవిద్యాలయాలను మళ్లీ దేశముఖ్ యూనివర్సిటీలుగా మార్చవద్దని సూచించారు.