BRSV : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాల మేరకు BRSV రాష్ట్ర విభాగం ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేటలో బీఆర్ఎస్వీ నాయకులు గురుకుల బాట కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రభుత్వ హాస్టళ్లను BRS విద్యార్ధి సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పలు హాస్టళ్ళను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విద్యార్థి నాయకులు రాపోలు నవీన్ కుమార్, నెమ్మది శ్రవణ్ కుమార్, బానోత్ సురేష్ నాయక్, గుండాల సందీప్, పల్లెపంగు నాగరాజు, రామావత్ అశోక్ నాయక్, వడ్డేపల్లి సందీప్, వేల్పుకొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.