హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని సీఎం రేవంత్‌రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు విమర్శించారు. దేశ ప్రజలందరూ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పిస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం వేడుకను రాజకీయ వేదికగా మార్చారని మండిపడ్డారు.