యాదగిరిగుట్ట, మార్చి 29 : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కార్మికుల ను ఒత్తిడికి గురిచేసినా కార్మికులంతా బీఆర్ఎస్కేవీకే పట్టం కట్టారు.
శనివారం జరిగిన ఎన్నికల్లో 30 ఓట్ల మెజారిటీలో బీఆర్ఎస్కేవీ ఘన విజయం సాధించింది. మొత్తం 390 ఓట్లకుగానూ బీఆర్ఎస్కేవీకి 209 మంది కార్మికులు ఓటు చేశారు. సీఐటీయూకి 179 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవాలు ఘనంగా జరిగాయి.