హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీ తెలుగు అచీవర్స్ సన్మాన కార్యక్రమంలో తనను భాగస్వామిగా చే యడం సంతోషకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నా రు. బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్ నాగేశ్వర్రావు, మాలావత్ పూర్ణ, తనికెళ్ల భరణి, మురళీనాయక్ తల్లిదండ్రులు, నితీశ్కుమార్రెడ్డిని సన్మానించుకోవడం గొప్ప విషయమని చెప్పారు. జీ తెలుగు న్యూస్ అభివృద్ధి పథం లో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చానల్ ఎడిటర్ భరత్, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.