KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన నాయకుల, కార్యకర్తల ఆగడాలు మితీమిరిపోతున్నాయి. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనాలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు భౌతిక దాడులకు కూడా కాంగ్రెస్ నాయకులు వెనుకాడడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో ఓ సామాన్యుడి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్డును అధికార పార్టీకి చెందిన నాయకులు జేసీబీతో కూల్చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ఘటనను చూస్తుంటే.. బడా భాయ్ సూచనలను చోటా భాయ్ పూర్తిస్థాయిలో ఫాలో అవుతున్నాడని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలోనూ బుల్డోజర్ రాజ్ ఉన్నాడని కేటీఆర్ సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్‌కు ఓటు వేసినందుకు గానూ, ఓ వ్యక్తి ఇంటిపైకి మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు బుల్డోజర్ తీసుకెళ్లి రేకుల షెడ్డును కూలగొట్టాడు. కొల్లాపూర్ 1వ వార్డు ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని, తనకు మెజార్టీ రాకపోవడానికి నీవే కారణం అంటూ.. అధికారంలోకి వచ్చాక పాస్టర్ నర్సింహ ఇంటిపైకి మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు, 1వ వార్డు కౌన్సిలర్ భర్త బుల్డోజర్ తీసుకెళ్లి హంగామా సృష్టించాడు. రేకుల షెడ్డును కూల్చేశాడు.
It appears that Chota Bhai is fully following the instructions of Bada Bhai
Bulldozer Raj in Telangana too!! https://t.co/gcBPk7hUCI
— KTR (@KTRBRS) May 22, 2024