Chief Guest |బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి జరగనున్న ఫైనల్ ఎపిసోడ్‌తో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రిపరేషన్స్, షూటింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రేక్షకుల్లో విజేతపై ఎంత ఉత్కంఠ ఉందో… ఫినాలేకు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరో అన్న అంశంపై కూడా అంతే ఆసక్తి నెలకొంది. గత కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే గత ఏడాది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలేకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా చిరంజీవే వస్తారని చాలామంది భావించారు. మరోవైపు ‘ది రాజా సాబ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిగ్‌బాస్ ఫినాలేకు వస్తారని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈసారి చిరంజీవి, ప్రభాస్ ఇద్దరూ ఫినాలేకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. చిరంజీవి బిజీ షెడ్యూల్, ప్రభాస్ షూటింగ్స్ కారణంగా రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో బిగ్‌బాస్ టీమ్ మరో స్టార్ హీరోని సంప్రదించిందని సమాచారం.అందుతున్న వార్తల ప్రకారం ఈసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మాస్ మహారాజ రవితేజ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో బిగ్‌బాస్ టీమ్ రవితేజను సంప్రదించగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. బిగ్‌బాస్ ఫినాలేకు హాజరైతే సినిమా ప్రమోషన్స్ కూడా కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నట్లు టాక్.
ఇక రవితేజే చీఫ్ గెస్ట్ అన్న వార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, గ్రాండ్ ఫినాలే రోజున బిగ్‌బాస్ స్టేజ్‌పై మాస్ మహారాజ సందడి చూడబోతున్నామని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో సంజనా,
ఇమ్మాన్యుయేల్ ఇప్పటికే హౌజ్ నుండి బయటకు రాగా కళ్యాణ్, తనూజ, పవన్ మాత్రం హౌజ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారని టాక్ నడుస్తుండగా, ఎక్కువ శాతం మంది కళ్యాణ్ విన్నర్ అని జోస్యాలు చెబుతున్నారు. మరి కొందరు తనూజ అని చెప్పుకొస్తున్నారు.