Toxic: A Fairy Tale For Grown-Ups | మెగా బ్లాక్‌బస్టర్ ‘KGF’ సిరీస్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale For Grown-Ups) (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె ‘నాడియా’ (Nadia) అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో కియారా అద్వానీ లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. ‘నాడియా’ అనే పాత్ర పేరుకు తగ్గట్టే ఆమె గెటప్ వైవిధ్యంగా కనిపిస్తోంది. యష్ సరసన కియారా నటిస్తుండటం ఇదే మొదటిసారి కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
KGF 2 వంటి భారీ విజయం తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఉగాది, గుడి పడ్వా మరియు ఈద్ పండుగల సెలవులను క్యాష్ చేసుకునేలా ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘TOXIC’: KIARA ADVANI’S FIRST LOOK UNVEILED – 19 MARCH 2026 RELEASE… The makers of #Toxic: A Fairy Tale For Grown-Ups have unveiled the #FirstLook poster of #KiaraAdvani [@advani_kiara] as #Nadia.
Five years after the record-smashing blockbuster #KGF2, #Yash returns to the big… pic.twitter.com/SDCtj55rXA
— taran adarsh (@taran_adarsh) December 21, 2025