KTR | ఆమన్‌గల్ : ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అవసరమైతే రేపోమాపో రేవంత్ రెడ్డి ఆడబిడ్డల పుస్తెల తాడు కూడా ఎత్తుకుపోతడు అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగింఆచరు.
ఆడబిడ్డలకు అరచేతిలో స్వర్గం చూపిండు రేవంత్ రెడ్డి.. అత్తకు రూ. 4 వేలు.. కోడలికి రూ. 2500 అన్నాడు. రూ. 500కు సిలిండర్ అన్నడు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నడు.. ఇప్పటి వరకు ఏది లేదు. 35 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిండు తప్ప 35 పైసలు ఢిల్లీ నుంచి తేలేదు అని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ఇదే కల్వకుర్తి తాలుకాలో, పాలమూరు జిల్లాల్లో రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమై వేరే రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. కానీ రేవంత్ పాలనలో ఏడాది తిరగక ముందే.. లోన్ కట్టలేదని చెప్పి ఇంటికాడ గేట్ ఎత్తుకు పోయారు. స్టాటర్లు ఎత్తుకుపోయారు. రేపో మాపో తులం బంగారం ఇచ్చుడు కాదు.. మీ పుస్తేల తాడు కూడా ఎత్తుకుపోతడు అని విమర్శించారు కేటీఆర్.