KTR | రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు.. రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డికి స్వార్థం తప్ప ఇంకోటి తెలియదు.. రియల్ ఎస్టేట్ తప్ప.. స్టేట్ ఫికర్ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమన్‌గల్‌లో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అన్నదాతలు, మహిళలు జాగ్రత్తగా, చైతన్యవంతంగా ఉండాలి. నాగర్‌కర్నూల్ జిల్లాలో రుణమాఫీ కాక చందు అనే రైతు బ్యాంక్ ముందు బైక్ కాలబెట్టి నిరసన చెప్పిండు. ఆదిలాబాద్‌లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకులోనే ఎండ్రిన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌లో సురేంద్ రెడ్డి అనే రైతు వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే సూసైడ్ చేసుకున్నాడు. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వేణోగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. దయచేసి మళ్లీ మోసపోవద్దు అని కేటీఆర్ సూచించారు.
మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఎకరం, అర ఎకరానికి పైసలు వేస్తుండు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది ఒక్కొక్క ఎకరానికి రూ. 17500. మళ్లా నమ్మి మోసపోతే.. మనల్ని ఎవరు కాపాడలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగండి.. రైతు బంధు, తులం బంగారం, 2500 ఎక్కడా అని అడగాలి.. స్కూటీలు ఏమైనయ్ అని ప్రశ్నించాలి. స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బాగా నడుస్తుంది. తుక్కుగూడ నుంచి ఇక్కడి దాకా.. రేవంత్ రెడ్డి ఆయన సోదరులు ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ.. ఏఐ సిటీ అని డ్రామా చేస్తుండ్రు. వెల్దండ వద్ద రేవంత్ కుటుంబానికి 500 ఎకరాలు ఉండే. మళ్లా 1000 ఎకరాలు సంపాదించిండు. మళ్లీ కొత్త కథ పెట్టిండు.. అత్తగారి ఊరికి కొత్త రోడ్డు వేసుకుంటడ. 1200 ఎకరాల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతుండు రేవంత్ రెడ్డి.. ఆయనకు స్వార్థం, తప్ప ఇంకోటి తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ ఫికర్ లేదు. ఇలాంటి రేవంత్ రెడ్డిని అసలు నమ్మకండి అని కేటీఆర్ సూచించారు.
బిల్లులు రాక సర్పంచ్‌లు ఆగం అవుతున్నారు. వారి గోస పుచ్చుకుంటున్నడు రేవంత్ రెడ్డి. సచివాలయం చుట్టూ తిప్పించుకునంటున్నడు. 600 కోట్ల ఇస్తే అయిపోతది. పాడి రైతులు ఇప్పటి వరకు పైసల్లేవు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నయ్ అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి..
Budget 2025 | బడ్జెట్ కూర్పుపై సర్కారు మల్లగుల్లాలు.. నేటికీ ప్రాధాన్యతా పథకాలను తేల్చని ప్రభుత్వం
KTR | రేవంత్ రెడ్డి నిజాయితీ గల్ల మోసగాడు.. కేటీఆర్ సెటైర్లు
KTR | రేవంత్ రెడ్డి రేపో మాపో మీ పుస్తెల తాడు ఎత్తుకుపోతడు : కేటీఆర్
KTR | కేసీఆర్ హయాంలో రైతు రాజులాగా బతికాడు : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

