KTR | హైదరాబాద్ : స్కాలర్షిప్ బకాయిలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిజాం కాలేజీ విద్యార్థిని సుమన ఎక్స్ వేదికగా కేటీఆర్కు అభ్యర్థన చేయగా.. ఆయన స్పందించారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ చెప్పారు కేటీఆర్.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మీరు అత్యంత చురుకైన నాయకులలో ఒకరు. నిజాం కళాశాల పూర్వ విద్యార్థిగా, మీరు ఎక్స్ వేదికగా మా సమస్యలను ముందుగానే పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని సుమన అనే విద్యార్థిని ట్వీట్ చేశారు.
ఇటీవలే నేను నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాను. టీసీ తీసుకునేందుకు వెళ్తే.. ఆర్టీఎఫ్ రూ. 28 వేలు, ఎంటీఎఫ్ రూ. 14 వేలు చెల్లించాలని అడిగారు. ఇప్పటి వరకు తమకు ఫైనల్ ఇయర్ స్కాలర్షిప్ చెల్లించలేదు. మాది మధ్య తరగతి కుటుంబం.. దయచేసి తక్షణమే స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నట్లు సుమన్ ప్రభుత్వాన్ని కోరారు.
We will take up the matter in upcoming assembly sessions
Thank you for bringing the issue to my notice Sumana https://t.co/zNqVaYcDrV
— KTR (@KTRBRS) August 29, 2025