KTR | హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నాకు ఓటుతో మద్దతుగా నిలిచిన పట్టభద్రులు అందరికి ధన్యవాదాలు, అందరి అంచనాలకు తగ్గట్టు భవిష్యత్‌లో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాను. మీ అంచనాలు చేరుకోలేకపోయినందుకు క్షమించండి అంటూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఏనుగుల రాకేశ్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీరు సాధ్యమైనంత వరకు కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్టుగా రావు. దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం అని కేటీఆర్ రాకేశ్ రెడ్డి ధైర్యం ఇచ్చారు.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో నాకు ఓటుతో మద్దతుగా నిలిచిన పట్టభద్రులు అందరికి ధన్యవాదాలు, అందరి అంచనాలకు తగ్గట్టు భవిష్యత్ లో రెట్టింపు ఉత్సాహం తో పని చేస్తాను. మీ అంచనాలు చేరుకోలేకపోయినందుకు క్షమించండి. నాకు అడుగడుగునా అండగా నిలిచిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు హృదయపూర్వక నమస్సులు. అలాగే మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తాత మధుతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలోగల నియోజకవర్గ ఇంచార్జిలకు, జిల్లా అధ్యక్షులకు, అతితక్కువ సమయంలో నన్ను గుండెలకు హత్తుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్గొండ కేంద్రంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసి, అన్ని తామై నడిపించిన ఆత్మీయులు అన్న కంచర్ల భూపాల్ రెడ్డికి, ఆత్మీయ సోదరుడు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి అంచనాలకు తగ్గట్టుగా భవిష్యత్‌లో పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం, పట్టభద్రుల కోసం నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మీ అందరికీ మాట ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీగా చట్టసభలో నేను అడుగు పెట్టలేకపోయినప్పటికి, ప్రజా సభలో నిత్యం మీ పక్షాన కొట్లాడుతూనే ఉంటాను. ఈ ఓటమి తాత్కాలికమే, భవిష్యత్ గెలుపుకు బాటలు వేస్తూ నిబ్బరంగా సాగుదాం. జై తెలంగాణ.. జై భారత్ అంటూ ఏనుగుల రాకేశ్ రెడ్డి తన ట్వీట్‌ను ముగించేశారు.
You did your best Rakesh. Results are not always in expected lines
Stay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm
— KTR (@KTRBRS) June 8, 2024