KTR | హైదరాబాద్ : ఈనాడు అధినేత రామోజీ రావు పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలుగు పత్రికా రంగంతో పాటు తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు రామోజీ రావు బీజం వేశారు. ఈనాడు పత్రిక స్థాపించిన తర్వాత, ఈటీవీ ద్వారా ఎల్ట్రానిక్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రొఫెషనిలజంతో, విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీ రావు గుర్తుగా నిలిచిపోతారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకునేవారు.
తెలుగు ప్రజలు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గురించి గొప్పగా మాట్లాడేవారు. ఎన్నో సందర్భాల్లో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం తనకు లభించింది. మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా అన్ని విషయాలు చెప్పేవారు. రామోజీ మృతి తెలుగు పత్రికా రంగానికే కాకుండా ప్రపంచంలోని తెలుగు వారంరదికీ తీరని లోటు అని పేర్కొన్నారు. యూనివర్సల్ స్టూడియో స్థాయిలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలన్న విజన్ రామోజీ రావుకే ఉండే. ఆయన ఆలోచనలు, జ్ఞాపకాలు తప్పకుండా భవిష్యత్లో అందరికీ స్ఫూర్తినిస్తాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఎప్పటికీ తెలుగు జాతి ఆయనను గుర్తు పెట్టుకుంటుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు pic.twitter.com/m3RfGiw6ka
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2024