KTR | హైదరాబాద్ : గుంజాల గోండి లిపి పండితుడు కొట్నాక్ జంగు(90) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. గుంజాల గోండి లిపిని నేర్పించేందుకు, దాన్ని సంరక్షించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన వారసత్వ సంరక్షకుడు కొట్నాక్ జంగ్కు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సజీవంగా ఉండేలా చూడడమే ఆయనకు తెలంగాణ అందించే గొప్ప నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన జంగు గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ జాతికి చెందిన చిన్నారుల కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. వారి కోసం గోండి-తెలుగు వాచకాలను ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు ప్రచురించారు. ఆదివాసీ చిన్నారుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేశారు. ఆయన చేసిన శ్రమను ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్ రావు గుర్తించి ఎంతో సహకరించారు. కాగా, జంగు మృతి పట్ల ఆదివాసీ పెద్దలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Heartfelt tributes to Kotnaka Jangu, a true guardian of heritage, who dedicated his life to learning and preserving the ancient Gunjala Gondi script
The greatest tribute Telangana can offer is to ensure that his mission lives on, safeguarding our roots for the future pic.twitter.com/xTrNyjAu1O
— KTR (@KTRBRS) September 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపాటు
KTR | అనుముల తిరుపతి రెడ్డి గారు.. ఆ కిటుకేదో సామాన్యులకు కూడా చెప్పండి: కేటీఆర్