హైదరాబాద్ : కల్తీ నెయ్యి విషయంలో ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అసహనం ప్రదర్శించారు. తిరుపతి లడ్డులో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ రిపోర్టు ఇచ్చింది కదా, మీరేమో ఉందంటున్నారు?.. అని విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు కోపంతో ఊగిపోయారు. నెయ్యి కల్తీ జరిగింది నిజమే కానీ అందులో జంతు కొవ్వు లేదని సిట్ రిపోర్టు చెబుతున్నదని ఓ జర్నలిస్టు చంద్రబాబును అడగగా…
‘ఐయాం ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్, జంతు కొవ్వు లేదని రిపోర్టులో ఎక్కడుంది?.. నీకు రహస్యంగా చెప్పారా?.. లేక నీకు కల వచ్చిందా?… నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా?.. వాట్ ఆర్యు టాకింగ్.. మర్యాదగా చెప్పినపుడు వినాలి.. అంతేగాని నేను నా ఇష్టప్రకారం మాట్లాడతా అడ్డదుడ్డంగా అంటే కుదరదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి… అన్నీ ప్రజలముందు పెడతాను.. ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేయాలి అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.