ఉప్పల్, మే 12 : ఇటీవల కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాప్రా మున్సిపల్ మాజీ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బండారి రాజిరెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నివాళులర్పించారు. హబ్సిగూడలోని రాజిరెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. రాజిరెడ్డి సోదరుడు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని పరామర్శించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలు తుల ఉమ, గెల్లు శ్రీనివాస్ యాదవ్, చిరుమల్ల రాకేశ్, గజ్జెల నాగేశ్, వాసుదేవారెడ్డి, విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, జేరిపోతుల ప్రభుదాస్, బన్నాల గీతా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.