KTR | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్య పడకండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.
మళ్ళీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుంది.. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకున్నామని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతీ ధాన్యం గింజ కొన్నామని కేటీఆర్ గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి జాన్సన్‌తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.