KTR | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సరారు ప్రజారోగ్యాన్ని పాతరేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గత 8 నెలలుగా పారిశుద్ధ్య నిర్వహణ దిగజారిపోవటంతో దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాతో ప్రజలు అవస్థలు పడుతున్నారని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో ఉదహరించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణం తేడాలేకుండా రోగుల సంఖ్య పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్‌కు ముందే చర్యలు తీసుకోవాలనే కనీస అవగాహన సర్కారుకు లేకపోవటంతో ప్రజలు విషజ్వరాల బారిన పడే దుస్థితి నెలకొన్నదని దుయ్యబట్టారు.
ఈ ఏడాది దాదాపు 5,700 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికారిక లెకలు చెప్తున్నాయని, అనధికారికంగా ఈ సంఖ్య పదిరెట్లు ఎక్కువగా ఉంటుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూకు సరైన సమయంలో చికిత్స అందకపోవటంతో ఇటీవల దాదాపు 50మంది చనిపోయారని, ఇందులో చిన్నపిల్లలూ ఉండటం బాధాకరమని అన్నారు. ఒక్క రోజే డెంగ్యూతో ఐదుగురు చనిపోయిన సంఘటన ప్రతి ఒకరిని కలిచివేసిందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవటం, సరిపడా మందులు లేని కారణంగా ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నదని అన్నారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాల్సిన సీఎం, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై సీఎం స్థాయిలో సమీక్షలు జరగకపోవటం వల్లే వైద్యారోగ్యశాఖ విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రజా ఆరోగ్యం అంటే పట్టింపులేదా? అని సీఎంను ప్రశ్నించారు.
విష జర్వాలు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, దోమల బెడద లేకుండా ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు కాస్త ఆలసమైనా ఇబ్బందులు రావని, ప్రాణం పోతే తిరిగిరాదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్షకాలానికి ముందే ప్రజారోగ్యంపై సమీక్షలు, ముందస్తు కార్యాచరణతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్న సందర్భాలను గుర్తుచేశారు. ఇకనైనా రాజకీయాలపై దృష్టిపెట్టడం మాని డెంగ్యూ, మలేరియా ఇతర విషజ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.