హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘నా ఆలోచనలు’ అనే పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. సామాజిక స్ఫూర్తితో రచయిత విజయ్‌కుమార్ పిన్నింటి ఈ పుస్తకాన్ని రాశారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, పార్టీ నాయకుడు రాకేశ్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.