KTR | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా అన్ని వర్గాలను ప్రజలను మోసం చేశారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు పెంచుతానని మాయమాటలు చెప్పి.. చివరకు పండు ముసలవ్వలను కూడా మోసం చేసిన నీచుడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆసరా పెన్షన్లు సకాలంలో రాక.. వృద్ధులు కూడా రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కల్లబొల్లి మాటలు జెప్పి పెద్దమనుషులను కూడా కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆసరా పెన్షన్లతో అవ్వ- తాతలకు కేసీఆర్ సర్కార్ భరోసా నింపిందని గుర్తు చేశారు. ఆసరా పెన్షన్ల కారణంగా కొడుకు, కోడలు కూడా వృద్ధులను గౌరవంగా చూసుకునే వాతావరణం బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. బొడ్లే సంచి బరువు పెంచి అమ్మమ్మ-నాయనమ్మల గౌరవాన్ని కేసీఆర్ పెంచారని తెలిపారు.
కానీ నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తా అని జూటా మాటలు చెప్పి.. మేమిచ్చిన పింఛన్ కూడా సరిగా ఇవ్వని రేవంత్ సర్కార్ ఇవాళ పండు ముసలవ్వలను సైతం రోడ్డెక్కి ధర్నా చేసే పరిస్థితి కల్పించారని కేటీఆర్ ఆగ్రహం వెలిబుచ్చారు. మొన్న గద్వాలలో అవ్వా-తాతలు రోడ్ల మీద ధర్నా.. ఇవాళ మానకొండూర్ పోలీస్ స్టేషన్లో వృద్ధ దంపతుల ధర్నాలు నిత్యకృత్యమయ్యాయని కేటీఆర్ తెలిపారు. పెన్షన్ల కోసం అవ్వలు రోడ్డెక్కి ధర్నా చేస్తే సిగ్గు అనిపించడం లేదా రేవంత్ అని కేటీఆర్ ప్రశ్నించారు. తక్షణం మీ జూటా హామీని అమలు చేసి అవ్వలకు 4 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
కల్లబొల్లి మాటలు జెప్పి పెద్దమనుషులను కూడా మోసం చేసిన కాంగ్రెస్
ఆసరా పెన్షన్లతో అవ్వ- తాతలకు భరోసా నింపింది కేసీఆర్ గారి సర్కార్
రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి కోడులు,కోడళ్ళు ప్రేమగా చూసుకునేలా చేసింది బిఆర్ఎస్
బొడ్లే సంచి బరువు పెంచి అమ్మమ్మ-నాయనమ్మ ల గౌరవం పెంచారు కెసిఆర్… pic.twitter.com/uNvwkXpvGi
— KTR (@KTRBRS) September 23, 2024
ఇవి కూడా చదవండి..
KCR | కేసీఆర్ అన్న ఎక్కడున్నావు..? నువ్వు రావాలంటూ కంటతడి పెట్టుకున్న తల్లీకొడుకు.. వీడియో
Wanaparthi | పింఛన్ల కోసం రోడెక్కిన వృద్ధులు.. భారీగా ట్రాఫిక్ జామ్
KTR | అమృత్ టెండర్లలో రేవంత్ భారీ అవినీతి.. బీజేపీ మౌనంపై కేటీఆర్ ఆశ్చర్యం..