KTR | హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న రేవంత్ తీరును ఎక్స్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.
ప్రచారంలో నీతులు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంలోకి వచ్చాన నీతిమాలిన పనులు చేస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరడం నేరం. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరితే ఊళ్లనుంచే తరిమికొట్టమన్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డినే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే. అందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి గారు..
ప్రచారంలో నీతులు..?
ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?నాడు..
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.
ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు.
భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.చివరికి…
ఎమ్మెల్యేలు పార్టీ మారితే… pic.twitter.com/iraQWtewv1— KTR (@KTRBRS) June 25, 2024