హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగా ణ): ‘మీ సర్కారు వైఖరి వల్ల ఇంకా ఎంతమంది రైతులు బలికావాలి? ఎంతకాలం బాధలు భరించాలి? ఈ బాధలు పడొద్దనే కదా, పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నది’ అని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ కాలేదన్న వేదనతో రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తన ను తీవ్రంగా కలిచివేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ సరార్ రుణమాఫీ విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇంకా ఎంతమంది రైతులు ఆత్మహత్య లు చేసుకోవాలని ప్రశ్నించారు.
రైతులు ఇలాంటి బాధలు పడొద్దనే తెలంగాణ పోరు జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో తమ వైఫల్యాన్ని ఒప్పుకొని, ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. స్ఫూర్తిదాయకమైన విధానాలతో రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను కేసీఆర్ సృష్టించారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుదల, తృణధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామికి ఎదిగిన రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని గ్రాఫ్ రూపంలో పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2015లో 11.1 శాతం ఉన్న రైతు ఆత్మహత్యలు 2022 వచ్చేసరికి 1.57 శాతానికి తగ్గిన గ్రాఫ్‌ను, 2015లో కేవలం 2.1 శాతం ఉన్న తృణధాన్యాల ఉత్పత్తి 2022 నాటికి 6.85 శాతానికి పెరిగిన వైనాన్ని ఉదహరించారు.
25 లక్షల చొప్పున పరిహారం ఎందుకివ్వరు?
భారీ వర్షాలు, వరదల కారణంగా మృతి చెం దిన వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం మౌనం వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఎందుకు పంపిణీ చేయరని ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో మరణించిన వారి వివరాలు వెల్లడించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది మరణిస్తే కేవలం 16 మంది మృతి చెందారని ప్రభుత్వం ఏ విధంగా లెక్కగట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా మరణించిన 31 మంది వివరాలను ఆయన పేర్లతో సహా విడుదల చేశారు.
కాళోజీ కళాకేంద్రం.. కేసీఆర్ ఇచ్చిన శాశ్వత నివాళి
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీకి కేసీఆర్ శాశ్వత నివాళి ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కాళోజీ చావు, పుట్టుక మధ్య జీవితమంతా తెలంగాణదేనన్నారని పేర్కొన్నారు. ఆ మహనీయుడి కీర్తిని తెలంగాణ సమాజం గుర్తుంచుకునేలా సెప్టెంబర్ 9న కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకొన్నామని తెలిపారు. హెల్త్ వర్సిటీకి కాళోజీ పేరు పెట్టిన విషయాన్ని ఉదహరించారు. వరంగల్‌లో కాళోజీ కళాకేంద్ర నిర్మాణం భవిష్యత్తు తరాల వారధిగా ఉండేలా కేసీఆర్ రూపకల్పన చేశారని, ఆ కేంద్రం నిర్మాణ దృశ్యాలను కేటీఆర్ ఎక్స్‌వేదికగా పంచుకున్నారు.