KTR | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించాలని మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఇప్పు డు ఆశ్చర్యకరంగా మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నాడు వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి నేడు తన ఉపముఖ్యమంత్రిని పం పిమరీ గనుల వేలంలో భాగస్వామ్యం కావడం కాంగ్రెస్ అవకాశవాదానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. గనుల వేలం విషయంలో దాగిన ఒత్తిళ్లు ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా సింగరేణి సంస్థ ప్రైవేట్‌పరం అవుతుందని, పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్‌రెడ్డి అంగీకరిస్తారో లేదో చెప్పాలని పేర్కొన్నారు. కేంద్రం గుజరాత్, ఒరిస్సా మాది రే తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి గనులను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఈవైఖరిని రాష్ట్ర ప్రభుత్వం ఎం దుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. సింగరేణి గొంతు కోసేలా ఉన్న ఈ గనుల వేలంలో ఉపముఖ్యమంత్రి, కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి పాల్గొనడం దుర్మార్గమని విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయడంలోనే తమ విజయం ఉందన్నట్టుగా వారిద్దరూ వ్యవహరించటం అత్యం త విషాదకరమని వ్యాఖ్యానించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే
కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ సింగరేణికి మరణశాసనం రాసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి పార్టీ ఫిరాయింపుల డ్రామాకు తెరలేపారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆరు నెలలైనా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఆగమైందని, బీజేపీ నీతిలేని నిర్ణయాల్లో కాంగ్రెస్ భాగమైందని ఆరోపించారు. తెలంగాణ ంపదను బీఆర్ఎస్ సర్కారు కాపాడితే కాంగ్రెస్, బీజేపీలు వాటిని చెరబడుతున్నాయని, ఆ రెండు పార్టీలను తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని పేర్కొన్నారు.