హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రజల జీవితాల్లో భోగభాగ్యాలతోపాటు సం‘క్రాంతి’ సంతరించుకొని సుఖసంతోషాలతో వర్థిల్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగిమంటలు, పాడిపంటలు, పిండివంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల ఆటపాటలు, పతంగుల రెపరెపలు ప్రతి మది పులకించిపోయేలా సాగాలని అభిలషించారు.