షాద్నగర్ : బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అండగా నిలిచారు. సౌదీలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ బాబ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు కేటీఆర్, అంజయ్య యాదవ్ అన్ని తామై చూసుకున్నారు. నిన్న అర్ధరాత్రి హేమ్లా నాయక్ తండాకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. విస్లావత్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
గత నెల 27న సౌదీలో బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ బాబ్య మృతి చెందారు. మృతి విషయం తెలిసిన వెంటనే విదేశాంగ శాఖ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. గత వారం రోజులుగా మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అంజయ్య యాదవ్ చేసిన కృషిని ఎప్పటికీ మరిచిపోమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
*కార్యకర్త కుటుంబానికి అండగా మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే అంజన్న*
*సౌదీలో మృతి చెందిన కార్యకర్త విస్లావత్ బాబ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు అన్ని తానై చూసుకున్న వై. అంజయ్య యాదవ్*
*నిన్న అర్ధరాత్రి హేమ్లా నాయక్ తండాకు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు… pic.twitter.com/kZd5TynBQN
— Anjaiah Yadav Yelganamoni (@AnjaiahYBRS) June 5, 2025