Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కురవి, అక్టోబర్ 14 : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మాజీ జెడ్పీ చైర్పర్సన్లు తుల ఉమ, అంగోత్ బిందు, శ్రీదేవి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సత్యనారాయణ వారికి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణలు చేసి వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారితో పాటు దుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ ముఖమండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం కురవి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురవి సర్పంచ్ లక్ష్మీ నాయక్, మాజీ ఆలయ చైర్మన్ రాజునాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, కొణతం విజయ్, పెద్ది వెంకన్న గౌడ్, ఐలి నరహరి గౌడ్, బోడ శ్రీనునాయక్, గుగులోత్ నెహ్రూనాయక్, సంగెం భరత్, భద్రు, భోజ్య నాయక్, బాణోత్ శారద, అంగోత్ కాంతి, సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

