హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కంపెనీ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఘన విజయం సాధించింది. ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్‌పై గెలిచారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంటీఏఆర్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359మంది కార్మికులను పర్మినెంట్ చేసి, కార్మికులకు క్యాంటీన్ ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. కార్మికుల బేసిక్‌ను 30% నుంచి 50% పెంచడంలో కీలక పాత్ర పోషించినందుకే తనకు కార్మికులు మద్దతుగా నిలిచారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్టీయూ యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్లు వెంకటేశ్వర్ రెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): యూట్యూబ్ చానళ్లు, సోష ల్ మీడియా వేదికల ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శనివారం సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాసర్, హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
*కార్మిక ఎన్నికలో BRS పార్టీ విజయం.*
*అధ్యక్షులుగా ఎన్నికైన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.*హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో భారత రాష్ట్ర సమితి నుండి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్… pic.twitter.com/ggmoFvUAiC
— V Srinivas Goud (@VSrinivasGoud) October 25, 2025