పెద్దవంగర, డిసెంబర్ 14 : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రూనాయక్ స్వగ్రామం రెడ్డికుంటతండాలో బీఆర్ఎస్ బలపర్చిన జాటోత్ యమున సమీప కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ శాంతిపై ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 74 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పెద్దవంగర మండలం రాజామాన్‌సింగ్ తండాలో ఒక్క ఓటుతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గుగులోత్ పటేల్నాయక్ విజయం సాధించారు.
తొర్రూరు, డిసెంబర్ 14: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామస్తులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. గ్రామంలో ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పుచెప్పారు. ఝాన్సీరెడ్డి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి ధర్మారపు కిరణ్‌పై, కాంగ్రెస్ అసమ్మతి వర్గం తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి బలపర్చిన రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ 80ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వగ్రామంలోనే కాంగ్రెస్ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది.