CPAC CIVIC Polls | తెలంగాణలో జరిగిన హోరాహోరీ లోక్‌సభ ఎన్నికల్లో కారు దూసుకెళ్తోందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఓట్లు కలిసిరావడంతో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని సీపాక్ తన సర్వేలో తెలిపింది. సీపాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్కు 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి రెండు, కాంగ్రెస్‌కు ఒక స్థానం, ఎంఐఎంకు ఒక స్థానంలో గెలుస్తుందని.. రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది. రైతులు, పెన్షనర్లు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు, ముఖ్యంగా కరెంటు, నీటి సమస్యల కారణంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని.. ఇది బీఆర్ఎస్కు కలిసొచ్చిందని పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి మళ్లకుండా.. బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గుచూపారని సర్వేలో తెలిసింది. ఈ క్రమంలోనే బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానాలను కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపింది.
కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, నాగర్‌కర్నూలు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీపాక్ ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. నిజామాబాద్‌లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టిపోటీ ఉంటుందని తెలిపింది. భువనగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. తాము జరిపిన పబ్లిక్ ఒపినియన్ పోల్, ఎగ్జిట్ పోల్, పోస్టపోల్ ప్రకారం.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని ఈ సందర్భంగా సీపాక్ తెలిపింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని ధీమా వ్యక్తం చేసింది. టీవీ 9 లైవ్ షోలో బిగ్ డిబేట్, బస్ యాత్రపై 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్ విజయానికి కలిసొచ్చాయని చెప్పింది.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత విజయం సాధిస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్ఎస్కు 50.49 శాతం ప్రజలు మొగ్గుచూపారని తెలిసింది. కాంగ్రెస్‌కు కేవలం 37.29 శాతం ఓట్లు పడ్డాయని పేర్కొంది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేశ్ రెడ్డి విజయం సాధించబోతున్నాడని సీపాక్ సర్వే తెలిపింది.
తెలంగాణలో బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని న్యూస్ 18 ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. కాంగ్రెస్ 5 నుంచి 8 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి రెండు నుంచి ఐదు స్థానాల్లో గెలుస్తుందని.. ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఓటింగ్ శాతం విషయానికొస్తే బీజేపీకి 37 శాతం, కాంగ్రెస్‌కు 34 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 21 శాతం మంది ప్రజలు మొగ్గు చూపినట్లు తెలిసింది.