Minister KTR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకు భారత రాష్ట్ర సమితి () అప్రతిహతంగా పురోగమిస్తుందని పార్టీ ప్రతినిధుల సభ ప్రకటించింది. భారతీయ సమాజం వికాసం ఆశించిన స్థాయి లో జరగడంలేదని.. దేశంలో అసహనం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాలపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరిస్తున్న తరుణంలో నిర్వహించిన ఈ సభ కీలక అంశాలపై దేశానికి స్పష్టత ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టి, బీఆర్ఎస్ ప్రాధాన్యతాంశాలను ప్రకటించింది. వాటిని సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సాధిస్తుందని సభ అభిప్రాయపడింది. ‘భారతదేశం రత్నగర్భ. ప్రకృతి ప్రసాదించిన అపారమైన అద్భుతమైన వనరులెన్నో ఉన్నా వాటిని వినియోగిం చుకోవడంలో ఇప్పటివరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయి. ప్రజలకు తాగునీరు అందించలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది’ అని విమర్శించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రెచ్చగొట్టడం కాకుండా బీసీ జన గణన చేపట్టాలని, చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో బీసీల తీర్మానాన్ని బలపరిచారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్లలో దాదా పు 1.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. బడ్జెట్లో బీసీ మంత్రిత్వ శాఖకు రూ.6,900 కోట్లు కేటాయించామని, దీనికి అదనంగా చేపలు, గొర్రెలకు నిధులు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా బీసీ గురుకులాలు, , ఢిల్లీలో ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశంలో బీఆర్ఎస్ హవా కొనసాగనున్నదని, కేసీఆర్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ ఆ రోజు జలదృశ్యం లో చెప్పిందే నేడు జరిగింది. మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. దేశం మొత్తం తెలంగాణతరహా పాలన కోరుకొంటున్నది. తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల ప్రజలు సైతం మన పథకాలు కావాలని కోరడం.. మన నాయకుడి సమర్థ పాలనకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. దేశం యావత్తు తెలంగాణ మాడల్ కోరుకొంటున్నదని చెప్పారు. దీంతో కేంద్రంలోని బీజేపీతోపాటు మోదీ, షా ద్వయానికి భయం పట్టుకొన్నదని అన్నారు. దేశానికి పట్టిన ఈ దారిద్య్రాన్ని పారదోలాలంటే కేసీఆర్‌లాంటి సమర్థుడు దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల దేశ చరిత్రలో దళితుల అభ్యున్నతి గురించి సీఎం కేసీఆర్ మాత్ర మే ఆలోచించారని విప్లవాత్మక దళిత బంధు తీసుకొచ్చారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చెప్పారు. ఇది దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచిందని తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ అని, దేశంలో నెహ్రూ తర్వాత అంతటి గొప్ప స్టేట్స్‌మన్ అని ప్రశంసించారు. పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రతినిధుల సభలో సచివాలయానికి అంబేద్కర్ పేరు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చే స్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టా రు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం దళితజాతికి గర్వకారణమని పేర్కొన్నారు. ఢిల్లీ పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాలంటే ఢిల్లీలో బీఆర్ఎస్ జెండాను ఎగరేయాల్సిందేనని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ పల్లా మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం నీళ్లు, విద్యుత్తు, ఆహార కొరతతో అలమటించడం దారుణమని, నాయకత్వలేమి దీనికి కారణమని.. కేసీఆర్ వంటి విజనరీతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలి పారు. విద్యుత్తు, వ్యవసాయం, నీటిపారుదల లో తెలంగాణ రోల్‌మాడల్‌గా ఉన్నదని, బీఆర్ఎస్ కేం ద్రంలో అధికారంలోకి వచ్చా క ఈ మూడింటిపై సమగ్ర విధానాన్ని సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. సింగపూర్‌కు లీక్వా న్ యీ, చైనాకు డెంగ్ జియావో పింగ్, జపాన్‌కు షింజో అబే, మలేషియాకు మెహతీర్ మహ్మద్‌లా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ నంబవర్‌వన్‌గా ఉన్నదని, రైతు బంధు, రైతుబీమాను అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని చెప్పారు.విద్యుత్తు రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించిందన్నారు.