బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను భారత్‌లోని ఒమన్ రాయబారి ఇస్సా అల్ షిబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం నందినగర్‌లోని నివాసంలో కేటీఆర్‌తో సమావేశమై, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఒమన్ రాయబారిని కేటీఆర్ సత్కరించి, చార్మినార్ జ్ఞాపికను అందజేశారు. కేటీఆర్ లాంటి విజనరీ లీడర్‌తో సమావేశం కావడం సంతోషంగా ఉన్నదని అల్ షిబానీ పేర్కొన్నారు.