22న బీఆర్ఎస్ జనచైతన్య సభ
బీఆర్ఎస్ జనచైతన్య సభ ఈ నెల 22న హనుమకొండలోని కేడీసీ మైదానం నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ఈ జనచైత్యన సభకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. బుధవారం మాజీ చీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల కోసమే సమ్మక-సారక బరాజ్ నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.
- హనుమకొండ కేడీసీ మైదానంలో నిర్వహణ
- మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
- దేవాదుల కోసమే సమ్మక-సారక బరాజ్
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
హనుమకొండ, నవంబర్ 18: బీఆర్ఎస్ జనచైతన్య సభ ఈ నెల 22న హనుమకొండలోని కేడీసీ మైదానం నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ఈ జనచైత్యన సభకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. బుధవారం మాజీ చీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల కోసమే సమ్మక-సారక బరాజ్ నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.
కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేధావులు, యువకులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ నెల 22న జరిగే సభలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరనున్నారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జన చైతన్య సభను విజయవంతం చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, అరూ రి రమేశ్‌తోపాటు మర్రి యాదవరెడ్డి, రమేశ్‌బాబు, చింతం సదానందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

