కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు రక్షణ లేదు
కాంగ్రెస్ పాలనలో గిరిజనులు, ఎస్సీ, బీసీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గూండాల చేతిలో సోమవారం దాడికి గురైన గుడికుంట తండా సర్పంచ్ బానోత్ మహేందర్‌ను బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పరామర్శించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.
- గిరిజన సర్పంచ్ మహేందర్‌పై దాడి అమానుషం
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, నవంబర్ 18 : కాంగ్రెస్ పాలనలో గిరిజనులు, ఎస్సీ, బీసీ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గూండాల చేతిలో సోమవారం దాడికి గురైన గుడికుంట తండా సర్పంచ్ బానోత్ మహేందర్‌ను బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పరామర్శించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాక్షిగా గిరిజన సర్పంచ్ బానోత్ మహేందర్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం అమానుషమని మండిపడ్డారు. తక్షణమే వారిపై కేసులు నమోదుచేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించేది లేదని, ఆర్ఎస్ సర్పంచ్‌లకు ప్రొటోకాల్ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లపై దాడులుచేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

