హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): అధికారాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్యవహారంపై బెదిరిస్తారని, తర్వాత తన అన్న తిరుపతిరెడ్డి వెళ్లి ఆ వ్యవహారంలో లబ్ధిపొందే వ్యక్తులతో మాట్లాడి సెటిల్ చేస్తారని చెప్పారు. ‘ముందు బెదిరించాలి ఆ తర్వాత సెటిల్ చేసుకోవాలి’ అనేవిధంగా రేవంత్ సోదరుల దందా నడుస్తున్నదని విమర్శించా రు. కేపీసీ కంపెనీకి రూ.210 కోట్ల కాం ట్రాక్టు కర్ణాటకలో వచ్చిందని, కేపీసీ సీఎండీ అనిల్‌కుమార్, రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి మధ్య ఎంత డీల్ కుదిరిందో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను కూల్చేయాలన్న రేవంత్‌రెడ్డి తర్వాత వారితోనే చేతులు కలిపారని, మోదీని కలిసి వచ్చిన తర్వాత వెంటనే ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను కలిశారని విమర్శించారు. కొడంగల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ, రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఏవీ రద్దు కాలేదని మం డిపడ్డారు. అదానీని తెలంగాణకు ఇన్‌డైరెక్ట్‌గా రేవంత్‌రెడ్డి తీసుకొస్తున్నారని దు య్యబట్టారు. రూ.5 వేల కోట్లకు ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను కొనేందుకు అదానీ సిద్ధమయ్యారని, దీనిని అడ్డుపెట్టుకొని దొడ్డిదారిన అదానీని తెలంగాణకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి నాలుకకు నరంలేదని, ప్రభుత్వం చేసే పనుల్లో నిజం లేదని, పూటకోమాట, ఆ మాటకో బ్యాగు అన్నట్టుగా రేవంత్‌రెడ్డి తీరు ఉన్నదని మండిపడ్డారు.
మోదీ ఎందుకు విచారణ జరపడం లేదు
రేవంత్‌రెడ్డి ఎన్ని సామ్‌లు చేసినా బీజేపీ ఎందుకు విచారణ అడగడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడే ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. పొరుగు రాష్ట్రంలో కూడా రేవంత్‌రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. డీకే శివకుమార్ తెలంగాణ కాంట్రాక్టర్ల వద్ద 15% కమీషన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మునిరత్నం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్తే అడ్డుకున్న అధికారులు, కాంగ్రెస్ నేత లు.. బీజేపీ వాళ్లు వెళ్తే మాత్రం దగ్గరుండి చూ పించారని మండిపడ్డారు. బీజేపీ రేవంత్‌రెడ్డి ఒకటేనని విమర్శించారు. బీజేపీ నాయకు లు కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు. రేవంత్ కుటుంబ పాలనపై బీజేపీ విచారణ జరపకపోతే బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని, అన్ని నిజాలు ప్రజల ముందు పెడుతామని హెచ్చరించారు.