హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఇంకెన్ని రోజులు తప్పుడు వార్తలు రాసి అసత్య ప్రచారం చేస్తారని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంపై వీ6 డిజిటల్ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘మనోళ్లే ముంచిం డ్రు’ అనే శీర్షికన ఆ పత్రిక డిజిటల్ ఎడిషన్‌లో ఓ కథనాన్ని వండివార్చినట్టు పేర్కొన్నారు. ‘ఎంపీ ఎన్నికల్లో ఓడగానే బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం చేశారని, నిరాశతో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు’ అంటూ అడ్డగోలు రాతలు రాసిందని ఫైర్ అయ్యారు.