హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ‘సరిగ్గా 23 ఏండ్ల కిందటి ఈ ఫొటో ఏ సందర్భంలోనిది? ఇక్కడ కేసీఆర్‌కి వచ్చిన ఆలోచన ఏంటి? ఆ ఆలోచనతో పుట్టిన పథకం పేరేమిటి? ఆ పథకం ద్వారా ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరింది?’.. అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఓ క్విజ్ నిర్వహించారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినవారికి ‘తులం బంగారం’ బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో బుధవారం ఈ ఫొటోను ఆయన పోస్టు చేశారు. సరిగ్గా 23 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ఒక పెండ్లికి వెళ్లారని, పెండ్లి కూతురిని ఆశీర్వదించారని తెలుపుతూ.. సంబంధిత ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలని నెటిజన్లను కోరారు.