నవాబ్‌పేట, డిసెంబర్ 26 : బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త దండు స్వామి (28) గురువారం బైక్‌పై జడ్చర్లకు వెళ్లాడు. రాత్రి ఊరికి తిరిగి వ స్తుండగా.. బండమీదిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి ఆరేండ్లుగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చురుకుగా పని చేస్తున్నాడు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు స్వామి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరొకరి జీవితం లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో.. స్వామి భార్య లావణ్య, తల్లిదండ్రులు ఉసేనమ్మ, వెంకటయ్య అతడి కండ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారు. స్వామి కండ్లను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు ఇచ్చారు.