హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆవరణమంతా చదును చేయగా, సభా ప్రాంగణం పూర్తికావచ్చింది. పెద్ద ఎత్తున ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు పనులు వేగవంతంగా చేస్తున్నారు. ప్రవేశద్వారం వద్ద కౌటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఎల్కతుర్తి సభా ప్రాంగణం ఆవరణలో ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు సోమవారం స్వయంగా పర్యవేక్షించారు.
ఎల్కతుర్తి వద్ద సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నేతలు సేద తీరేందుకు ఏర్పాటుచేసిన కారవాన్
ఎల్కతుర్తిలోని సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు
సభకు వెళ్లేందుకు దారిఖర్చుల కోసం సిద్దిపేటలో కూలిపని చేస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ నాయకుడు సంపత్‌రెడ్డి తదితరులు