హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పవిత్రమైన శాసనసభ సాక్షిగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి శవ రాజకీయాలకు తెరలేపారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. అబద్ధాల కోరు నాయకత్వం వహిస్తే.. అబద్ధాలకు హద్దులు ఉండవని, పవిత్రమైన అసెంబ్లీ గోడల మధ్య అ డ్డంకులు లేకుండా వ్యాప్తి చెందుతాయని సీఎం తీరుపై ఎక్స్‌లో శ నివారం ట్వీట్ చేశారు. రేవతి వి షాద మరణంపై రాజకీయ ఆరోపణలు చేయడానికి అసెంబ్లీని వాడుకున్నారని ధ్వజమెత్తారు. అల్లు అర్జున్‌పై నమోదైన కేసు హైకోర్టు పరిధిలో ఉన్పప్పటికీ అసెంబ్లీలో ప్రస్తావించి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని విమర్శించారు. ఇది ఆర్టికల్ 121, 211, నిబంధన 65(7) స్ఫూర్తిని ఉల్లంఘించినట్టే అవుతుందని తెలిపారు. శాసనసభ విధివిధానాలు, ప్రవర్తన నియమాల్లోని 66, 82కు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి అంశాన్ని సభలో మాట్లడేందుకు స్పీకర్ ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. నిజంగా రేవతి కుటుంబంపై సానుభూతి ఉం టే ఆమె కుటుంబానికి ఇప్పటిదాకా పరిహారం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. థియేటర్ వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా అనుమతి ఇచ్చిన పోలీసులపై ఎందు కు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సీఎం సోదరులపై చర్యలేవి?
అసెంబ్లీ సాక్షిగా తన సోదరులకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పిన సీఎం.. కొండారెడ్డిడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మరణానికి కారకులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని దాసోజు శ్రవణ్ ప్రశించారు. సీఎం సోదరులే తన చావుకు కారణమని సూసైడ్ నోట్లో సోయిరెడ్డి స్పష్టంగా పేర్కొన్నా.. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని పేర్కొన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్ల ను కూలుస్తూ సీఎం సోదరుడికి మాత్రం నోటీసులకే పరిమితం చేయడమేంటని తెలిపారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదురొంటున్న సీఎం సోదరులపై చర్యలేవని ప్రశ్నించారు.