రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అధికారీ పార్టీ సర్వశక్తులు ఒడ్డినా పెద్ద సంఖ్యలో గ్రామాలు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ పోరులో గులాబీ గుబాళింపుతో శ్రేణుల్లో సంతోషం నిండింది. కాగా, ఆయా చోట్ల గెలుపుతో ప్రజల సంబురం అంబరాన్నంటింది. గెలిచిన అభ్యర్థుల అనుచరులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆనందహేలతో గ్రామీణం కళకళలాడింది.
పలు గ్రామాల్లో ఓడినా, కుట్రల కాంగ్రెస్‌కు దీటుగా ఓట్లు రావడం నాయకులు, కార్యకర్తల్లో ఆత్మైస్థెర్యం నింపింది. రెండేండ్ల హస్తం పాలనపై విసిగి వేసారిన ప్రజానీకం పంచాయతీ పోరులో మార్పునకు శ్రీకారం చుట్టిందని ఫలితాల తీరుతో స్పష్టమవుతున్నది. ఇక రానున్న రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో తమ జోరు చూపుతామంటూ గులాబీ సేన గళమెత్తింది. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో పల్లె హోరెత్తింది.
ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరు మండలంలోని అమ్మనబోలులో బీఆర్ఎస్ అభ్యర్థి మామిడాల నర్సమ్మ గెలుపుతో డ్యాన్స్ చేస్తున్న స్థానికులు

మహబూబ్‌నగర్ జిల్లా అన్నాసాగర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఆల శ్రీకాంత్‌రెడ్డి గెలుపుతో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి ఇంటి ఎదుట నృత్యం చేస్తున్న స్థానికులు

నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి అశోక్ కుమార్, వార్డు సభ్యులతో కలిసి విజయ సంకేతం చూపుతున్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్‌లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఆల శ్రీకాంత్‌రెడ్డి గెలుపుతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి స్వీట్లు తినిపిస్తున్న నాయకులు

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ సర్పంచ్‌గా గెలుపుతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి సైదిరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సంబురాలు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఎంకేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి దయాకర్ గెలుపుతో సంబురాల్లో పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్‌నగర్ గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దాసరి పరశురాములు గెలుపొందడంతో గ్రామంలో స్థానికులు, అనుచరులు, కుటుంబసభ్యుల సంబురాలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో బీఆర్ఎస్ బలపర్చిన దాసారపు సరోజన గెలుపుతో పార్టీ శ్రేణలతో సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, తదితరులు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం దేన్యతండాలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కొండల్ నాయక్ గెలుపుతో స్థానికుల సంబురాలు