తల్లాడలో శ్రేణులకు దిశానిర్దేశం
పెనుబల్లి/వైరా టౌన్, ఏప్రిల్ 9 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి గృహంలో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు.