హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కర్ణాటక వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్రపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాల్మీకి సాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర ఉన్నదని ఆరోపించారు.
దేశంలో ఏ నుంచి జెడ్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సాంలు జరిగాయని, కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో రూ.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అనేక సంస్థలు చెప్పాయని గుర్తుచేశారు. వాల్మీకి కుంభకోణంలో మొత్తం రూ.187 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనికి బాధ్యుడైన కర్ణాటక మంత్రి నాగేంద్ర ప్రస్తుతం జైల్లో ఉన్నారని తెలిపారు.
వాల్మీకి సంస్థ డబ్బులను తెలంగాణ, ఏపీకి తరలించారని, ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్రపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాల్మీకి సొసైటీలో జరిగిన రూ.90 కోట్ల అవినీతిలో ఏపీకి రూ.45 కోట్లు, తెలంగాణకు మరో రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు.
ఇందులో వీ6 బిజినెస్ సొల్యూషన్స్‌కు రూ.4.50 కోట్లు బదిలీ అయ్యాయని, ఈ కంపెనీ ఎవరిదో కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలని అన్నారు. సీబీఐ విచారణ చేస్తున్న ఈ సామ్‌పై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ సామ్లో తెలంగాణకు చెందిన సత్యనారాయణ వర్మను అరెస్టు చేశారని.. ఆయన రూ.3.50 కోట్లతో స్పోర్ట్స్ కారు సహా 35 కిలోల బంగారం కొనుగోలు చేశారని వివరించారు. ఈ సాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్రపై రేవంత్‌రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.